Post Offices: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్‌లోని పోస్టాఫీసుల్లో ఉన్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గత 19 ఏళ్లలో దాదాపు రూ.96 కోట్లను స్వహా చేశారు. 2002-2021 మధ్య కాలంలో ఈ అవకతవకలు జరిగాయి. ఈ సొమ్ములన్నీ సేవింగ్స్ ఖాతాల్లోని ప్రజాధనమే కావటం గమనార్హం. జనం ఎంతో నమ్మకంతో దాచుకున్న ఈ డబ్బును ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వాడుకున్నారు.
ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో వెల్లడించింది. పోస్టాఫీసుల్లోని స్టాఫ్ మోసపూరిత విత్‌డ్రాయల్స్, ఫోర్జరీ, చీటింగ్ తదితర నేరాలకు పాల్పడ్డారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా అన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తంతు కొనసాగిందని తెలిపింది. కాగ్ సమర్పించిన ఈ ఆడిట్ రిపోర్టుని ప్రభుత్వం నిన్న పార్లమెంట్‌కు సమర్పించింది. పోస్టాఫీసుల్లో అవినీతి జరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్, హర్యానా, త్రివేండ్రం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిళ్లలో ఈ అక్రమ లావాదేవీల వల్ల వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. బాధ్యులపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. నిందితులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు తెలిపాయి. తెలంగాణ, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి స్పందన రావాల్సి ఉన్నట్లు కాగ్ పేర్కొంది.
Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
పెట్రోల్‌కి పెరిగిన డిమాండ్
2021 జులైతో పోల్చితే 2022 జులైలో పెట్రోల్‌కి 6.1 శాతం డిమాండ్ పెరిగింది. 2022 జులైలో మొత్తం 17.62 మిలియన్ టన్నుల చమురు వాడకం జరిగింది. అయితే ఇది 2022 జూన్ కన్నా 5.7 శాతం తక్కువే. జూన్‌లో 18.68 మిలియన్ టన్నుల ఇంధనం వినియోగమైంది. ఈ వివరాలను పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ వెల్లడించింది. ఎల్‌పీజీ అమ్మకాలు 1.7% పెరిగి 2.41 మిలియన్ టన్నులకు చేరినట్లు తెలిపింది.
500 మందికి పైగా ఇంటికి
చికాగో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఇ-కామర్స్ సంస్థ 500 మందికి పైగా స్టాఫ్‌ని తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య 15 శాతంతో సమానం. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా ఇలా చేసింది. ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగకపోవటంతో స్టాఫ్‌ని తీసేయాల్సి వస్తోందని సంస్థ సీఈఓ కేదార్ దేశ్‌పాండే వెల్లడించారు.