పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. టికెట్ రేట్లను వారికి ఇష్టం వచ్చినంత పెంచి వసూలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. ప్రైవేట్ టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు సంక్రాంతి.. మరోవైపు శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఖర్చును సైతం లెక్క చేయకుండా సొంత ఊర్లకు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్.. ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు రాబడుతున్నారు.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని…
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు అధికారులు. దూర ప్రాంత సర్వీసులకు చార్జీల పెంపుపై ఎలాంటి సమస్య లేకపోయినా… నగర, పల్లెవెలుగు సర్వీసులకు ప్రయాణ దూరం తక్కువగా ఉండడంతో వాటి చార్జీలు ఏవిధంగా పెంచాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తకుండా టికెట్ల ధరను సర్దుబాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల సర్వీసులకు కిలో మీటరుకు పావలా చొప్పున పెంచితే… కొన్ని ప్రాంతాలకు టికెట్ ధర 186 రూపాయలు, ఇంకొన్ని ప్రాంతాలకు 204…