ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్రం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. అదేరోజున రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. గతేడాది రైల్వే బడ్జెట్ 1,10,055 కోట్లు కాగా, ఈ ఏడాది బడ్జెన్‌ను డబుల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైల్వే బడ్జెట్‌కు సంబంధిత మంత్రిత్వశాఖ తుదిమెరుగుతు దిద్దుతున్నది. ఇక ఇదిలా ఉంటే, గతేడాది రైల్వే శాఖకు సుమారు 26,338 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కరోనా కారణంగా వివిధ రైళ్లు ఆగిపోవడంతో ఈ నష్టం సంభవించింది. కాగా, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్ సుమారు రూ. 2.25 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read: ఎన్నికల కోసం కేజ్రీవాల్ వినూత్న కార్యక్రమం…
రైల్వే ప్రయాణికులకు అదనంగా సౌకర్యాలు కల్పించబోతున్నారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకు బుల్లెట్ రైలును ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాదు అల్యూమినియంతో తయారైన పది కొత్త లైట్ వెయిట్ ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో పాటుగా ఈ ఏడాది బడ్జెట్ తరువాత టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.