గత పదకొండు నెలలుగా ప్రభుత్వం పై పోరాడుతున్నామని, ప్రభుత్వం ను ఇరుకున పెట్టే విదంగా ప్రశ్నిస్తున్నామన్నారు. మమ్ములను రాజకీయంగా ఎదుర్కోలేక.. మా కుటుంబ సభ్యుల మీద, మా మీద మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన, నిరంకుశ చర్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. తమ ఫిర్యాదులను శాంతియుతంగా లేవనెత్తినందుకు 39 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం స్పష్టమైన అణచివేత చర్య , వారి గౌరవం , రాజ్యాంగ హక్కులపై దాడి అని ఆయన అన్నారు.
పార్టీ పవర్లో ఉన్నప్పుడు మస్త్ మస్త్ ఎంజాయ్ చేసిన ఆ లీడర్స్ ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారు? చివరికి బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం ఎందుకు డుమ్మా కొడుతున్నారు? వాళ్ళను వెంటాడుతున్న భయం ఏంటి?ఇంకా మన టైం మొదలవలేదంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? లేక వేరే ఆలోచనలో ఉన్నారా? ఎవరా లీడర్స్? ఎక్కడ జరుగుతోందా తంతు?
నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని ఆయన బండి సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని, కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పు అని ఆయన అన్నారు.
ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. సమస్యల పుట్ట ధరణి పోర్టల్ అని.. మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశ్యంతో తీసుకువచ్చారని అనుకున్నామన్నారు. కానీ ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారని చెప్పారు. రైతులకు అనేక ఇబ్బందులు కలిగాయని తెలిపారు.
కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని.. బండి సంజయ్ అన్నారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. రాహుల్ గాంధీకి మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మాత్రం మోడీని అనుసరిస్తానని తెలిపారు. READ MORE: Jammu…
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ..కానిస్టేబుల్స్ ను కేసీఆర్ మనుషులుగా చూస్తే.. రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారన్నారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయటం దారుణమన్నారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.