Talasani Srinivas Yadav : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై బీఆర్ఎస్ కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు అన్యాయం చేసేలా సర్వే రూపొందించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుషించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ సర్వే కోసం 57 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, దీనివల్ల అనేక మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేకపోయారని తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్…
PM Letter: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కి సంతాప సందేశాన్ని పంపారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ లేఖను రాసారు. ఈ లేఖలో ప్రధాని నరేంద్ర మోడీ.. శ్రీమతి చీటి సకలమ్మ గారి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఈ అనుకోని…
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తోంది.. బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు.. ఆ తర్వాత ఈ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు సిద్ధమయ్యారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ టార్గెట్‌గా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... ప్రచారం మాత్రం కచ్చితంగా ఆయనకు బీజేపీ పరంగా వచ్చే అవకాశాల్ని దెబ్బ తీస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఈటలను కేంద్ర బిందువుగా చేసుకుని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా? లేక ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్న ఆరాలు పెరిగిపోతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
T. Ram Mohan Reddy: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇక, కేటీఆర్ దమ్ముంటే శివారెడ్డిపల్లెకి రావాలంటూ సవాల్ విసిరారు. మీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ ఇచ్చిందో.. మా సర్కార్ ఎంత ఇచ్చిందో నువ్వు ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంటే తెలుస్తుంది అన్నారు.
V. Srinivas Goud: తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది అని ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు..
Puvvada Ajaykumar : డివిజన్ లో ప్రజా సమస్యలు డైరీ లో రాయాలి, బయటకు వెళ్ళేప్పుడు డైరీ తీసుకుని వెళ్లి రాసుకోండన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం రెచ్చిపోయారని, మనల్ని మన పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసం లో పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పగడాల నాగరాజు, దేవాభక్తుని కిషోర్ వంటి వారిని…
KTR: జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు…
Harish Rao : కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన మాజీ ఆర్థికమంత్రి హరీష్ రావు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని. కానీ దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్ దేశమంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుందని, కానీ పోయినసారి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి…