Petrol Hike: వాహనదారులకు ధరల మంటలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పలు దేశాల్లో ఇంధన సంక్షోభం
- పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ధరల పెరుగుదలతో వాహనదారులు బెంబేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం తీసుకొచ్చింది. గత కొద్దిరోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వార్ కారణంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రస్తుతం శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా ప్రభుత్వం ధరలను పెంచేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ధరల పెంపు ఇలా:
ఆక్టేన్ 92 పెట్రోల్: లీటర్‌కు రూ.24 పెంచడంతో ధర రూ.317కి చేరింది.
ఆక్టేన్ 95 పెట్రోల్: లీటర్‌కు రూ.25 పెంచడంతో ధర రూ.365కి చేరింది.
ఆటో డీజిల్: లీటర్‌కు రూ.22 పెంచడంతో ధర రూ.303కి చేరింది.
సూపర్ డీజిల్: లీటర్‌కు రూ.24 పెంచడంతో ధర రూ.353కి చేరింది.
కిరోసిన్: లీటర్‌కు రూ.13 పెంచడంతో ధర రూ.195కి చేరింది.
అలాగే పాకిస్థాన్‌లో కూడా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. చమురు సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. లీటర్‌కు రూ.55 పెంచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రకాల వాహనాలు, వ్యాపారాలు, ఇతర సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ దేశాలు ఇంధన ధరలు పెంచేశాయి. ఇలానే మరిన్ని దేశాలు కూడా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!