Komatireddy Venkat Reddy : తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని, ఇకపై ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CPL) సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల భూమికపై…
MLA Anirudh Reddy : తెలంగాణలో ఇటీవల, ఒక ముఖ్యమైన రాజకీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు నాయకులు , మీడియా ద్వారా ప్రచారం చేయబడిన రహస్య భేటీ వివాదంపై, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం స్పందించారు. కొన్ని రోజుల క్రితం, ఈ ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలతో కలిసి రహస్య భేటీ నిర్వహించారని, ఆ భేటీలో వారు ఒక మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, గురువారం జరిగిన…
Kunamneni Sambasiva Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబుక్యాంపు లోని రజబ్అలి భవన్ లో సింగరేణి.. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధుల తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ పై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి లో ప్రైవేటు వ్యవస్థ లతో బొగ్గు ఉత్పత్తి యత్నాలను విరమించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బావుల మీద శ్రద్ధ చూపకుండా ప్రైవేట్ వ్యాపారల…
KTR : బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేసిన కేసును కూడా ఫాలోఅప్ చేయనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో కోర్టులో పోరాడతామని, తమ పార్టీ నేతల బృందం న్యాయవాదులతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతేగాక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ…
తెలంగాణ సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికను చట్ట సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఆ పార్టీ వైఖకి అసెంబ్లీలో ఒకలా, శాసన మండలిలో మరోలా ఉండటం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదాస్పద ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఫోన్ చేసి మళ్లీ కలిసి పని చేయాలని పిలిచారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పారు. ‘‘నేనంటే గిట్టని వారు, సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు’’ అని ఖండించారు. తాను చాలా కాలంగా బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో…
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్…
Legislative Council : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడారు. మధుసూదనాచారి మాట్లాడుతూ, కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ డేటా వివరాలు ఇప్పటివరకు అందరికీ అందుబాటులో లేవని…