గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని హైదారాబాద్ ఇన్చార్జి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమే అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో గత పది ఏళ్లలో లేని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంటే ఈర్శగా ఉందా? అని మంత్రి పొన్నం విమర్శించారు. జీహెచ్ఎంసీ…
Harish Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడని విమర్శించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నాడు.. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని దుయ్యబట్టారు.
గతంలో ఎవ్వరూ రేషన్ కార్డులు ఇవ్వలేదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందని…
జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. ఈరోజు జరిగిన అరాచకం నిజాంపాలనలో కూడా జరగలేదని పల్లా మండిపడ్డారు. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోమని, మలి దశ ఉద్యమ సమయంలో పోరాడిన గడ్డ జనగామ అని మర్చిపోవద్దని హెచ్చరించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన ఎమ్మెల్యే పల్లా,…
KTR : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. భట్టి విక్రమార్క rతన “రేషన్ కార్డు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి నాలుగు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తాం” అనే ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఒక గ్రామానికే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పరిమితమా? అని ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్ )లో కేటీఆర్.. ‘…
కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు? తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.