జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల…
పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపైన తొలి దెబ్బను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ కొట్టబోతోందని అన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. మొగులయ్యకు ఇంటి స్థల సమస్యతో పాటు కంటి చికిత్స బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటానని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం.
Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు ఇది చావో రేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా…సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే… సిట్టింగ్ సీట్ అనేకాకుండా… ఈ ఉప ఎన్నికలో గెలిస్తే… తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, కేడర్లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తోందట.…
నిన్న(గురువారం) తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఇటీవల కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి రాద్దాంతం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తన తల్లిదండ్రుల సాక్షిగా హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా..…
సోమాజిగూడ శ్రీనగర్లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ రియాజ్, కార్పొరేటర్లు విజయా రెడ్డి, సంగీత, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎన్ఎస్యూఐ సెక్రటరీ కుందన్ యాదవ్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, స్థానిక సీనియర్ నాయకులు సమావేశంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ కేటీఆర్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) గట్టి బుద్ధి చెప్పబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఏ మాత్రం ముందుకు సాగలేదని, ఇప్పుడు ప్రజలే ఆ విఫలతకు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. CM Chandrababu Tweet: సాంకేతిక పరంగా చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించాం.. భారత్ ఏఐ ప్రయాణం ప్రారంభం.. అంతేకాకుండా.. “జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ…