Sarpanch Election: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మామపై కోడలు పోటీ చేసి విజయం సాధించింది. కాగా, శ్రీరామ్‌నగర్ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో రాధిక 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అయితే, కుటుంబ విభేదాల కారణంగా గత కొంతకాలంగా మామ- కొడుడు వేర్వేరుగా ఉంటున్నారు.
Read Also: Akhanda2Thaandavam : నన్ను చూసుకునే నాకు పొగరు, నా వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ
ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సత్యనారాయణ గౌడ్ పోటీ చేయగా, బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల సపోర్టుతో రాధిక బరిలోకి దిగారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన పోరులో చివరికి రాధిక స్వల్ప మెజారిటీతో గెలిచి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించింది. కుటుంబ రాజకీయాల నడుమ జరిగిన ఈ ఎన్నిక ఫలితం గ్రామంలో విస్తృత చర్చకు దారితీసింది. రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే కాకుండా, కుటుంబ విభేదాలు కూడా ఎన్నికల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.