Minister Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై టీఆర్ఎస్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అపరిచితుడు సినిమాలో మాదిరిగా టీఆర్ఎస్ తన వైఖరి మారుస్తూ వస్తోంది.. ఉదయం రాము.. రాత్రి రేమోగా మారినట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు.
CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశాం.. ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.
Payal Shankar: జనాభా లెక్కన రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన అని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. పూలే వారసులం అయిన బీసీలకు చదువులు దక్కడం లేదు.. తాము కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్నాం.. అవకాశాలు మాత్రం బీసీలకు రావడం లేదు.. గత పాలకులు 7లక్షల కోట్ల అప్పులు చేశారు.
అవినీతి రారాజు కడియం శ్రీహరి కరెప్షన్ గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కడియం శ్రీహరి తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక, అవినీతి గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు.. నేను ఎగురుతా, దుకుతా, పాడుతా నీకేంటి అని ప్రశ్నించారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరుగలేదనడం హాస్యాస్పదం.. కళ్ళు లేని కబోది కడియం... అది నోరా మున్సిపాలిటీ మొరా అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని అన్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ గా ఉన్నాడని వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము…
కౌన్సిల్ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన తెలిపారు. మెడలో మిర్చి దండలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని రూ. 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైంది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. Also Read:Ponnam Prabhakar:…
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని…
CM Revanth Reddy : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై ఎవరి వద్ద అయినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు, కేసీఆర్ నువ్వే రా అంటూ కౌంటర్ ఇచ్చారు. 2023లో ప్రజలు కాంగ్రెస్…
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. బయట బూతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నాం.. కానీ బూతులతో పాటు, అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు.
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్ను పరిశీలించనున్నారు.