కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కేసీఆర్ అంటే... ఎవరికి తెలియదని, ఆయన గురించి అంత ఉపోద్ఘాతం అవసరమా అనుకుంటున్నారా? యస్... మీరనుకునేది కరెక్టేగానీ... అసలు మేటరంతా అక్కడే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Harish Rao: రాష్ట్ర శాసన సభ చరిత్ర లో ఇది చీకటి రోజు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభ వాయిదా వేశారు.. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది.. 20 శాతం కమిషన్ ఏ ప్రభుత్వం హయంలో జరగలేదు.. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టులు కట్టాం.. రైతు బంధు ఇచ్చాం.
Deputy CM Bhatti: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది అని ఆరోపించారు. వాళ్ల హయాంలో బడ్జెట్లో 38 శాతం ఖర్చు పెట్టలేదు, ఆ నిధులను ఎవరికి కేటాయించారు అని అడిగారు.
Minister Seethakka: శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి రాష్ట్రం పరువు తీస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరువు తీసింది ఎవరు? అని ప్రశ్నించింది.
Alleti Maheshwar Reddy: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్.. ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నారు.. కానీ, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. పదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం.. గొప్పలకు పోయి గత ప్రభుత్వం నిధులు వృథా చేసింది అని ఆరోపించారు.
Off The Record: తెలంగాణ అంతా ఒక లెక్క అయితే.. అ నియోజకవర్గంలో ఇంకో లెక్క అన్నట్టుగా ఉందట. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ.. అప్పర్ హ్యాండ్ సాధించేందుకు అస్త్ర శస్త్రాలన్నింటినీ వాడేస్తున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇలాగే ఉంటే.. మీకే కష్టమని సొంత పార్టీ నుంచే ఎమ్మెల్యేకి హెచ్చరికలు వెళ్తున్నాయట.
మోడీ అంటే నాకు గొప్ప గౌరవమని సీంఎ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్లు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మేము అభివృద్ధి మేము సాధించినట్టా? లేక మీరు చేసినట్టా? అని మోడీని అడిగారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్…
ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
MLC Kavitha: తెలంగాణ బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చెప్పిన మాటలే చెప్పడం తప్ప.. అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరం కానున్నారు. ఈరోజు జరగబోయే బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అవనున్నారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈసారి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగంతో…