బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలని డిసైడయ్యారు. అన్ని జిల్లాలకు వెళ్ళి, పార్టీ మీటింగ్స్ పెట్టి కేడర్లో ఉత్సాహం నింపాలన్నది ప్లాన్ అట. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైందట
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపొతే రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు.
Ponnam Prabhakar: యాదగిరి గుట్ట టెంపుల్ పై శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి చేశామని చెప్తున్నారు.. మా జిల్లా దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. కానీ, ఎక్కడా అభివృద్ధి జరగలేదు అని తెలిపారు.
MLA Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ వేల కోట్లు అప్పు చేసినా.. ఏం చేశారో కానీ.. యాదగిరి గుట్టను మాత్రం కట్టారు.. అది మంచి ఆలోచన అని పేర్కొన్నారు.
Madhusudhana Chary: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. గతంలో మీరు (కాంగ్రెస్) ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదు అని విమర్శించారు.
MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు.18 ఏళ్ళు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ఫ్లకార్డ్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు. Also Read:Danam Nagender: ఇది సీరియస్ మ్యాటర్.. జీరో అవర్ లో…
2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది.
Ponnam Prabhakar: బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు శుభ సూచిక.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు.
BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజ్వరేషన్లు కల్పించేలా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడింది.