ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తు్న్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది.. మన దగ్గర భూమి సరిపడా ఉంది.. పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం.. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారు.. బీజేపీ వాళ్లు డిల్లీలో యమున నది శుద్ధి చేస్తామంటారు.. కానీ తెలంగాణలో మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు..
Also Read:Italy: కోర్టు కీలక తీర్పు.. జైళ్లో ఖైదీల కోసం సె0క్స్ రూమ్ ప్రారంభం
మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.. చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది.. నడి చెరువులో ఇండ్లు కడితే కూడా కూల్చొద్దు అంటున్నారు.. జపాన్ లో ఉండి మీరు కూడా చూస్తున్నారు.. సాగు నీరు.. పరిశ్రమల ఏర్పాటు..ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నాం.. తెలంగాణ అభివృద్ధికి అందరూ సహకరించాలి.. మీ ఊరు బాగుపడింది అంటే మీకు సంతోషం కాదా.. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి.. జపాన్ లో ఉన్న మీరు కూడా మాతృభూమికి అంతో ఇంతో అండగా ఉండండి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.