Harish Rao : రెండో దశ ‘కంటి వెలుగు’ విజయవంతం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి హరీష్ రావు అధ్యక్షతన కంటి వెలుగు సన్నద్ధత పై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్కే భవన్ నుండి మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి పాల్గొన్నారు. అయితే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుండి సమీక్షలో ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచయతీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 18 జనవరి 2023 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ కంటి వెలుగు ప్రారంభం కానున్నట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. గ్రామ పంచాయతీ, వార్డు కేంద్రంగా ఎక్కడిక్కడే కంప్యూటరీకరణ పరీక్షలు చేయాలని సూచించారు. జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.
Also Read : China Corona: ఆ నగరంలో 70శాతం మందికి కోవిడ్.. బాధితులతో కిక్కిరిసిన ఆస్పత్రులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థలు, ఇతర ప్రజా ప్రతినిదులందరు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతం చేసిందని, 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో రెండో దఫా కంటి వెలుగు ప్రారంభిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల తో పాటు ఉచితంగా, మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read : Rashmika Mandanna: సమంతపై రష్మిక సంచలన వ్యాఖ్యలు.. ఒక అమ్మలా రక్షించాలని ఉంది
Also Read
జిల్లాల్లో ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందన్నరు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసిందన్నారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుంది అన్నారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటుందన్నారు. ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏ ఎన్ ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో ఉంటారన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయడం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లోపే ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!