మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు మార్గంలో వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి తన వాహనాన్ని నిలిపివేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వెంటనే పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు ఎంపీ మాలోత్ కవిత. అనంతరం అత్యవసర చికిత్స విభాగానికి చేర్పించి.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని మానవత్వంతో తన వాహనంలో హాస్పిటల్‌కు తరలించిన ఎంపీని పలువురు అభినందించారు. అయితే.. ఎంపీ మాలోత్ కవితి ఇలా రోడ్డు ప్రమాదాలకు గురై వారికి సాయం చేయడం మొదటిసరేం కాదు. ఆ మధ్య ఓ సారి తన కాన్వాయ్‌ని ఆపి.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు.
Also Read : Avatar 2: ఈ హాలీవుడ్ సినిమాని వంద కోట్ల మార్క్ టచ్ చెయ్యనివ్వని హీరో ఎవరో తెలుసా…
అయితే.. 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కవిత, 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటిచేసి తెలంగాణ రాష్ట్ర సమతి ఆభ్యర్థి ఆజ్మీరా చందూలాల్ పై 15,367 ఓట్ల తేడాతో గెలుపొందింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, నవంబరు 4న తన తండ్రి రెడ్యా నాయక్ తో కలిసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పై 1,46,663 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2019 సెప్టెంబరు 19న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా నియమించబడింది. 2019, అక్టోబరు 9న మహిళా సాధికారత కమిటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా నియమించబడింది. మాలోత్ కవిత 26 జనవరి 2022న మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.