Ravela Kishore : ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. అందుకే బీఆర్‌ఎస్‌లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఏపీకి చెందిన నేతలు చేరనున్నారు. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌లతో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి కూడా నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు నన్ను బాగా ఆకర్షించాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని ఆయన విమర్శించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు రావెల.
Also Read : Hyderabad Metro : మరో 45 రోజుల పాటు హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పెంపు
చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మాణం చేస్తామన్నారు. తోట చంద్రశేఖర్ నేను మంచి స్నేహితులం.. గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పని చేశాం.. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ చేసినట్లే ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ పేరుతో రాజకీయ పార్టీలను అణిచివేయలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీకి దేశ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చివరి శ్వాస వరకు కేసీఆర్ తోనే ఉంటా.. బీఆర్‌ఎస్ లో కొనసాగుతానని ఆయన తెలిపారు.
Also Read : NIMS : నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ వైద్యుల భర్తీ నోటిఫికేషన్
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!