Minister Jagadish Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
Off The Record: సినీ సెలబ్రెటీలతో పొలిటికల్ లీడర్స్‌కు స్నేహమో.. బంధుత్వమో ఉండటం సహజం. ఆ విషయం ముందుగానే జనానికి తెలిస్తే అందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఏదేనీ ఫంక్షన్‌కు లీడర్స్ వస్తే వచ్చారని అనుకుంటారు.. రాకపోతే ఎందుకు రాలేదు అని ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఆరా తీస్తారు. అదే.. హీరోలకు.. పొలిటికల్ లీడర్స్‌కు ఉన్న సాన్నిహిత్యంపై ఎలాంటి లీకులు లేకుండా.. ఒకే ఫ్రేమ్‌లో పదే పదే తళుక్కుమంటే చర్చగా మారడం ఖాయం. హీరో…
Off The Record: గులాబీ పార్టీ అధినేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర వెళ్లినా.. కర్నాటకలో పర్యటించినా ప్రధాన ఆకర్షణగా నిలిచారు నటుడు ప్రకాష్‌రాజ్. పైగా కేసీఆర్‌తో చాలా చనువుగా కనిపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పొలిటికల్ వ్యూహరచనల్లోనూ పాల్గొన్నారు ఈ నటుడు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే క్రమంలో సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు కూడా. అయితే BRS జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్న తరుణంలో ప్రకాష్‌రాజ్ యాక్టివ్‌గా…
తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎదిగిందని ఆయన తెలిపారు. శనివారం రాత్రి ఆదిలాబాద్‌లో జరిగిన చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
TRS Party: బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి పయనమయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకుని.. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో కొంతమంది కొత్త పార్టీ తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.