Pidamarthi Ravi: ఖమ్మంలో తారాస్థాయికి చేరిన పొంగులేటి వర్సెస్ బీఅరెఎస్ నేతల మధ్య మాటల యుద్ధం చర్చకు దారితీసింది. పొంగులేటి పై బీఅర్ ఎస్ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన పొంగులేటి అనుచరులు కౌంటర్ ఇచ్చారు. ఈనేపథ్యంలో.. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సంచలనంగా మారాయి. వెన్నుపోటు పొడవడం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు అలవాటైందని, చివర వరకు సండ్ర బీఅర్ ఎస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదన్నారు పిడమర్తి రవి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు. భారీగా వచ్చిన జన సముహంను చూసి ఎమ్మెల్యే సండ్ర కు నిద్రపట్టడం లేదని ఎద్దేవ చేశారు.
Read also: Revanth Reddy: నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. అసలు ఆ ప్రస్తావన తేలేదు
వెన్నుపోటు పొడవడం సండ్రకు అలవాటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నగరంలో ఎన్నేస్పి భూమి ని కారు చౌక గా తీసుకొని బీఅర్ ఎస్ పార్టీ లో చేరారని ఆరోపించారు. ఈ విషయం జనం అందరికీ తెలుసన్నారు. మాకు స్పష్టమైన ఎజెండా ఉందన్నారు. ఎజెండా చెప్పే పది నియోజకవర్గాల్లో జనం ముందుకు వెళతామని తెలిపారు. పొంగులేటి పై సండ్ర వెంకటవీరయ్య వ్యక్తి గతంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కూడా సండ్ర పై వ్యక్తి గతంగా దాడి చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. త్వరలోనే సండ్ర అక్రమాల చిట్టాను బయట పెడుతామన్నారు. పార్టీలు మారే ఉసరవెల్లి సండ్ర అంటూ ఆరోపణలు గుప్పించారు. చివర వరకు సండ్ర బీఅర్ ఎస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదన్నారు. పొంగులేటి ని విమర్శించే స్థాయి సండ్ర కు లేదన్నారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్