నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇక్కడి చక్కెర పరిశ్రమను మూసేశారంటూ విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానన్న అరవింద్ ఇక్కడి రైతులను నిలువునా మోసం చేశారని ఫైర్ అయ్యారు. బాండ్ పేపర్ ఇచ్చి మాట తప్పిన అరవింద్ ను పొలిమేరలకు తరమాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. ప్రజలే శాశ్వతం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Kohli – Ashwin: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. కోహ్లీ – అశ్విన్ ఖాతాల్లో రికార్డులు
కేసీఆర్ కట్టు బానిస ప్రశాంత్ రెడ్డి ఇక్కడి యువతకు గంజాయి అలవాటు చేస్తుండు అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే డైరీ రాసి పెట్టండి.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిద్దాం అంటూ మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ కు ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ అంటూ రేవంత్ రెడ్డి గరమయ్యారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో డబుల్ బెడ్రూంలు ఇచ్చారు.. మీకు ఓట్లు వేసిన ఇక్కడి ప్రజలకు డబుల్ ఇల్లు ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
Also Read : Nandamuri Balakrishna: బాలయ్య డేంజరస్.. ఏయ్.. టాలీవుడ్ మైఖేల్ జాక్సన్
ఓట్లు వేసిన ప్రజలకు డబుల్ బెడ్రూం ఇవ్వని దద్దమ్మ మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఇంత అధ్వాన్నమైన రోడ్లు తాను ఎక్కడా చూడలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని ఈయనేం మంత్రి అంటూ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ వేదిక సాక్షిగా ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. 2018లో 62 కోట్లతో అమరవీవీరుల స్థూపం కడతామన్నారు.. ఐదేళ్లలో బడ్జెట్ 200 కోట్లకు పెరిగింది.. ఇందులో 50కోట్లు ప్రశాంత్ రెడ్డి కమీషన్లు దండుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం కాంట్రాక్టులపై విచారణకు ఆదేశించండి.. మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతిని నిరూపిస్తాం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.