Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తప్పుడు కేసులు బనాయించి ప్రజాప్రతినిధులను, నేతలను వేధింపులకు గురిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.. అయితే, ఈ కేసులో సంచలన వాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శించున్న ఆయన..…
Off The Record: రంగారెడ్డి-హైదరాబాద్- మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన నామినేషన్ల పరిశీలన తర్వాత 21 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ సంఖ్య తగ్గుతుందో లేదో కానీ.. అధికారపార్టీ బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అన్నది పెద్ద చర్చగా మారుతోంది. పోటీలో ఉన్న AVN రెడ్డికి బీజేపీ సపోర్ట్ చేస్తోంది. గత ఎన్నికల్లో MLCగా గెలిచి.. తర్వాత గులాబీ పార్టీలో చేరిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి ఫీల్డ్‌లో ఉన్నారు. PRTU నుంచి…
Off The Record: రెండు దశాబ్దాలపాటు వైద్యుడిగా సేవలందించి.. ప్రస్తుతం అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ అబ్రహం.. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో అలంపూర్ సీటు SCలకు రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డితో ఉన్న పరిచయాలు ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగపడ్డాయి. తర్వాత టీడీపీలోకి వెళ్లి పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. అలంపూర్‌లో ఈస్థాయిలో…
Ponguleti Srinivas Reddy: రాజకీయంగా వచ్చే పదవులు ఎవరికి శాశ్వతంగా ఉండవని.. ప్రజల్లో ప్రేమ అభిమానాలు ఉంటే పదవులు వాటి అంతటికి అవే వస్తాయన్నారు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. శనివారం చండ్రుగొండ మండల కేంద్రంలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, సొంత జాగా ఉన్నవారికి…
కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏదీ..! అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ ప్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ది ఐరన్ లెగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు బెదిరింపు కాల్స, మెసేజ్ లు వస్తున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.