Bandi Sanajay: రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ నీవల్ల కాదు కదా! మీ తాత వల్ల కూడా కాదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీలాంటి కేసీఆర్ లను వందల మందిని కాంగ్రెస్ చూసింది.. నిన్నే మూడు చెరువుల నీళ్లు తాపించి మూడు నెలల్లో బంగాళాఖాతంలో ముంచుతాం.. ఇక కాస్కో ఖబర్దార్ అంటూ సవాల్ విసిరారు.
BJP Reverse Gear: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక కార్యక్రమాలు (కౌంటర్ ప్రోగ్రామ్లు) నిర్వహించేందుకు సిద్ధమైంది. 21 రోజుల పాటు వివిధ అధికారిక కార్యక్రమాలపై శాఖలు, శాఖల వారీగా ప్రతికూల ప్రచారం (నెగటివ్ క్యాంపెయిన్) నిర్వహించాలని, నిరసనలతో (రివర్స్ గేర్) కేసీఆర్ ప్రభుత్వ తీరును తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Bandi Sanjay letter to CM KCR: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరుతూ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay Chitchat: రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం నాకు చేతకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నాకు చేతకాదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్రం రాగానే టీఆర్ఎస్ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్న కేసీఆర్ మాట తప్పారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.