MLC Jeevan Reddy: కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి పోయిదంటూ.. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. రూ.4వేల కోట్లతో నీళ్లు అందించే అవకాశం ఉండగా.. మిషన్ భగీరథతో రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల పై రు.1,20,000కోట్ల అప్పుల భారం పడిందని అన్నారు. దీంతో రాష్ట్రాన్ని 2 లక్షల అప్పుల ఊబిలోకి నెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Dharmana Prasada Rao: పైసా రాలేదు.. చేతి చమురే వదులుతోంది..
దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు.. ధర్మపురిలో నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు కాన రావడం లేదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ధర్మపురిలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన.. నిరసన వ్యక్తం చేయకుండా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాగు నీళ్లు కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారా.. ఇదేనా సుపరి పాలన అంటే అని నిలదీశారు. ఊరికో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. రూ. 10లక్షల చొప్పున 1000 కోట్లు, పైపు లైన్, నీటి సరఫరాకు మరో 3000 కోట్లు.. మొత్తం 4000 కోట్లతో రాష్ట్ర ప్రజలందరికీ తాగు నీరు అందించే అవకాశం ఉండేది. కానీ రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో మిషన్ భగీరథ నీరు నెలకు నాలుగు సార్లు బందు ఐతున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు భగీరథ నీరు తాగుతున్నారా.. అని ప్రశ్నించారు.
Read Also: Ramya Krishna: రాకీభాయ్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన శివగామి.. వీడియో వైరల్..
ఒక వైపు తాగునీరు సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే 2 కే రన్ పేరిట డీజే పెట్టుకొని డాన్సులు చేసుడా దశాబ్ది ఉత్సవాలు అంటే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. దశాబ్ది ఉత్సవాలు అంటే ప్రజా అవసరాలు గుర్తించి, పరిష్కరించడం అని మరిచారా అని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పేరిట రూ.40 వేలకోట్లు అప్పుల భారం ప్రజలపై వేశారన్నారు. రొల్ల వాగు చరిత్ర మంత్రి ఈశ్వర్ కు తెలుసా అని ప్రశ్ని్ంచారు. రాజుల చెరువు అయిన రోల్ల వాగు ద్వారా కాంగ్రెస్ పాలనలో 0.25 టీఏంసీ సామర్థ్యంతో అందించిన దానికన్నా అదనంగా ఒక్క ఎకరానికి నీరు అందించారా నిలదీశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పత్రికల ద్వారా చర్చకు సిద్దమని చెప్పడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. వాస్తవాలు వెలిక్కి రావాలి.. ఏ పథకంపై అయినా, పత్రికా ముఖంగానైనా చర్చకు సిద్దమెనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.