Harish Rao : దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది అన్నారు. పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసినట్లు చెప్పారు. ఇటీవల ఏక కాలంలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడం వల్ల టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమై అయినట్లు చెప్పారు. సోమవారం టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఇ రమేష్ రెడ్డి, అరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.
Also Read : Kesineni Nani Vs PVP: బెజవాడలో హీటేక్కిస్తున్న రివెంజ్ పాలిటిక్స్..
Also Read
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
అంతేకాకుండా.. ‘ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందెందుకు, ప్రభుత్వం తరఫునుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ వంతుగా ప్రతి ఒక్కరు బాగా పని చేయాలనీ కోరుతున్నాను. కొద్ది కాలం నుండి మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఘనంగా ప్రకారం మాతృ మరణాల రేటు రాష్ట్రంలో ఘనంగా తగ్గింది. తెలంగాణ ఏర్పడినాడు 92 గా ఉంటే ఇప్పుడు 43 కు తగ్గించగలిగాము.
వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇవన్నీ మీరంతా చేస్తున్న కృషికి నిదర్శనం. అయితే దీంతో మనం సంతృప్తి చెందకూడదు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలవాలి. సీఎం కేసీఆర్ గారు పెద్ద మొత్తంలో బడ్జెట్ ఇచ్చారు. కొత్త మెడికల్ కాలేజీలు ఇచ్చారు, వైద్యులు ఇచ్చారు, వైద్య పరికరాలు ఇచ్చారు… ఇలా అడిగినవన్నీ మనకు వెంటనే మంజూరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరేలా మనందరం కృషి చేయాలి.
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు రోల్ మోడల్ గా టీచింగ్ ఫాకల్టీ ఉండాలి. క్రమశిక్షణ గా ఉండేలా చూడాలి. ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలి. దీనివల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది. యాంటి ర్యాగింగ్ గురించి కాలేజీలో ప్రచారం చేయండి. ర్యాగింగ్ వంటివి సహించము.
క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెందెంట్స్ దే లేదా పూర్తి బాధ్యత. రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలి. అవసరం అయితే తప్ప రెఫర్ చేయకూడదు. స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందాలని మనం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ ఎం సి నిబంధనలు ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ ల పైన ఉంది. తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
స్టయిఫండ్సు వేతనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాము. ఇటీవల 15శాతం కూడా పెంచాము. ఎలాంటి ఆలస్యం జరగకుండా సూపరింటెండెంట్ లు చూసుకోవాలి. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలి. అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలి.
ఎక్విప్మెంట్ నిర్వహణ విషయంలో పీఎంయు ఏర్పాటు చేసుకున్నాం. ఐదు లక్షల రూపాయలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలు పూర్తిగా పొందుపరిచాలి. ప్రతి ఆసుపత్రి సూపరింటెందెంట్ చెక్ చేసుకోవాలి. ఆసుపత్రుల్లో ఎన్ని వైద్య పరికరాలు PMU పరిధిలో ఉండాలి. అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాలి.
డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని చెప్పాము. ఈ విషయం పేషెంట్లకు తెలిసేలా బోర్డ్ ఏర్పాటు చేయండి. 56 టిఫా స్కానింగ్ మిషన్లను ఏకకాలంలో ప్రారంభించుకున్నాం. అన్ని వైద్య పరికరాలు పనిచేసేలా చూసుకోవాలి గర్భిణులకు సేవలు అందాలి. కొత్త మెను ప్రకారం డైట్ అందుతుందా లేదా తరుచూ చెక్ చేయండి. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ విషయంలో ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసాము. ప్రతి సోమవారం కమిటీ మానిటరింగ్ చేసుకోవాలి. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి. ఉదయం 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలి. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యంతో పాటు బోధన పరిశోధనపై దృష్టి సారించాలి.’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
-
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
-
Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
-
Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!