తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు.
Ponguleti: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
MLA Seethakka: పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం అందించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటన కొనసాగుతుంది.
పోలీసులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు.
రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి కరెంట్పై డెవలప్మెంట్ ఛార్జీలు వేసి ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంత రావు సవాల్ విసిరారు.
Bhatti vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామ శివారులోని మర్లపాడ్ తండాకు చేరుకున్న సందర్భంగా రోడ్డు పక్కనే గ్రామస్తులు మూడవత్ రెడ్యానాయక్, హనుమంతు నాయక్, బొజ్యానాయక్, జగన్ నాయక్, సత్య నాయక్, రాంలీ నాయక్, రమేష్ .. భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు.