తాము నిరక్షరాస్యులం ఏమీ కాదని.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టి వేసాయని, తమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సీఎం సిద్ధ రామయ్యతో చర్చిస్తాం అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయని.. మరి వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.…
ఒకే అంశంపై బీఆర్ఎస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా? పార్టీ వైఖరి కూడా ఎప్పటికప్పుడు మారుతోందా? బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ విషయంలో గులాబీ పార్టీ గందరగోళంలో ఉందా? ఏంటా భిన్న స్వరాలు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్సీ కవిత మరోసారి పార్టీని గట్టిగా ఇరుకున పెట్టారా? లెట్స్ వాచ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు బీసీ అజెండాతో ముందుకు వెళ్లాయి. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని…
ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ లీడర్స్ చేతులెత్తేశారా? స్థానిక సమరానికి ప్రత్యర్థులు కత్తులు నూరుతుంటే… వాళ్ళ మాత్రం అస్త్ర సన్యాసం చేశారా? యుద్ధానికి మేం సిద్ధమని సైనికులు అంటుంటే… నడపాల్సిన దళపతులు మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు? వాళ్ళకు ఎక్కడ లేడా కొడుతోంది? ఏ జిల్లాలో ఉంది అంత దారుణమైన పరిస్థితి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీని.. మాజీ ఎమ్మెల్యేలు గాలికొదిలేశారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఆ విషయమై కేడర్ తీవ్ర ఆందోళనలో…
BRS: తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా, వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు రెండు కీలక లేఖలు రాశారు.. ఒక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను…
KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
తెలంగాణ రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ‘తెలంగాణలో సంక్షేమ పనులు అభివృద్ధిని చూడలేని గత పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. పేదలు తినే ప్రతి బుక్కలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతుంది. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి పని చేస్తుంది.…
తెలంగాణ భవన్లో మెదక్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సిద్దిపేట అంటే పందులు గుర్తుకు వచ్చేవి.. మెదక్ అంటే గాడిదలు గుర్తుకు వస్తాయని హరీష్ రావు చెప్పారు.. సిద్దిపేటలో పందులు మాయం అయ్యాయి కానీ మెదక్‌లో మాత్రం ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి.. వాటి సంగతిని బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారు.. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చింది. రేవంత్…
నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ఎక్స్ అఫీషియో, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరుకానున్నారు. అయితే నేటి కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ సమావేశం చర్చనీయాంశంగా మారింది.
Minister Seethakka : మంత్రి సీతక్క ప్రజా భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు కేటీఆర్ స్పందించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు కేటీఆర్ కు అర్దం కానట్లు ఉందని, విదేశాలలో ఉన్న కేటీఆర్ తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉందన్నారు. Raj Thackeray: ఠాక్రేలను కలపడానికి, బాలాసాహెబ్ చేయలేనిది…