Telangana Elections 2023: తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. దీంతో పాటు అన్ని పార్టీల నేతలు సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ భయ పెట్టాలని చూస్తున్నారు అని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
Kotha Prabhakar Reddy who will be nominated today: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కోట ప్రభాకర్ రెడ్డి గురువారం దుబ్బాకలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Harish Rao: తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట నుంచి మరోసారి బరిలోకి దిగిన హరీశ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అసమర్థత వల్లే సింగరేణిలో వాటాను కోల్పోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సోమాజిగూడలో ఇంటరాక్టివ్ మీటింగ్కు మంత్రి కేటీఆర్ హాజరై ఎన్నికల్లో పారిశ్రామికవేత్తల మద్దతు కోరారు. తాను ఇక్కడికి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చానని, మీ మద్దతు కావాలని పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు.
రాహుల్ కు ఎద్దు ఎవుసం తెలుసో లేదో.. ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటున్నారు.. రైతు బంధు ఎలా వస్తది.. భీమా ఎలా రావాలి.. వడ్లు కొంటే బ్యాంకులకే డబ్బులు పంపిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.