రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంక్రాంతికి గంగి రెద్దులు వచ్చినట్టు కాంగ్రెస్, బీజెపీ వాళ్ళు ఓట్ల కోసం వస్తారన్నారు. కాంగ్రెస్, బీజెపీ, బీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ, వ్యక్తుల మధ్య పోటీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆరున్నర ఏళ్లు మాత్రమే బీఆర్ఎస్ పని చేసిందని, తెలంగాణ రాక ముందు 55 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సెస్ వాళ్ళను కరెంట్ కోసం బ్రతిమిలాడమని, కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం పొలాల వద్ద ప్రతి రాత్రి జగరనేనన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Varun Tej: అత్తారింటికి బయల్దేరిన మెగా ప్రిన్స్ .. కొత్త జంటతో పాటు ఆమె కూడా
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్‌కి అలాంటి దరిడ్రులు మళ్ళ కావాలి. రేవంత్ రెడ్డి అన్నారు 24 గంటల కరెంట్ వద్దు అని. కాంగ్రెస్ వాళ్లకు ఎవుసం పై ఏం తెల్వదు. కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా ఆలోచన చేయండి. కాంగ్రెస్ హయాంలో తాగునీరు కోసం ఇబ్బంది పడ్డాం. కరెంట్ వచ్చే, రైతు బంధు, అసరా పెన్సన్ వచ్చే. ఊల్లోల్లు అలుగుడు గులుగుడు ఉంటుంది. బీడీ చుట్టే మహిళలను అనాడు కాంగ్రెస్ వాడు దేకినొడు ఉన్నాడా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు. రేవంత్ రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు. నేను మీ కులపొడిని, మూడు సార్లు ఒడి పోయిన అంటూ ఏడుస్తారు నమ్మవద్దు, భీష్ముడు మంచివాడే కానీ కౌరవులతో ఉంటే ఒడి పోతాడు, ఇక్కడే కూడ గట్లనే ఉంది. అనాడు సర్కార్ దవాఖానా పోలేని వారు, నేడు సర్కార్ దవాఖానా నే పోతం అంటున్నారు. కుక్కలకు కొట్టినట్టి, కాంగ్రెస్ వాళ్ళను ముసలి వారు కొట్టెట్టు ఉన్నారు. చందిర్తి లో గోదావరి నీళ్ళు తెచ్చాం. వరి ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ దేశం లో నెంబర్ వన్. కేసీఆర్ ను మూడవ సారి ముఖ్యమంత్రి చేయాలి. కేసీఆర్ గొంతు నొక్కడానికి కాంగ్రెస్, బీజెపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు, తెలంగాణ గొంతు కేసీఆర్. కులం, ప్రాంతం ఫీలింగ్ చూపించవద్దు.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Sitaram Yechury: ప్రత్యేక హోదాను వెనకేసుకొచ్చిన బీజేపీ మాటతప్పింది..