ఖమ్మం వేంసూరు మండలం అమ్మపాలెంలో సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. నూతన జిల్లాగా సత్తుపల్లి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఐటి టవర్ ఒక్కటి ఏర్పాటు చేస్తామని, వెంగళరావు పార్క్ అభివృద్ధి చేస్తామన్నారు సండ్ర. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్రిస్మస్ లోపు సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చాక దళిత బంధు అమలు చేయకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగమని ఆయన వ్యాఖ్యానించారు. డిడిలు కట్టిన యాదవుల అందరికి గొర్రెల యూనిట్లు ఇస్తామని, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్ళకు మరమత్తులు చేస్తామన్నారు సండ్ర. వేంసూరు మండలంలో గురుకుల పాఠశాల,బస్టాండ్,వేజ్ నాన్ వేజ్ భవన నిర్మాణలు చేపడతామన్నారు. పెనుబల్లి మండలంప్లే గ్రౌండ్ ను బస్టాండ్‌ను అధునీకరణ చేస్తామన్నారు.
అంతేకాకుండా.. ‘బుగ్గపాడు ఫుడ్ ఫార్క్ కంప్లీట్ చేసి నిరుధ్యోగ యువతకు ఉపాది కల్పిస్తాం. కల్లూరు హెడ్ క్వాటర్ లో డిగ్రీ కళాశాల,వెజ్ నాన్ వేజ్ భవానాలు ఏర్పాటు చేస్తాం. పది జిల్లాలను 30 జిల్లాలు చేసిన ఘనత కేసీఆర్ దే. సత్తుపల్లి, అశ్వారావుపేట రెండు కలుపుతూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. సత్తుపల్లిలో ఆటోనగర్ ఏర్పాటు అవశ్యకత ఉంది ఆటోనగర్‌ను ఏర్పాటు చేస్తాం. సత్తుపల్లిలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తాం. కేసీఆర్ పాలన అధికారంలోకి వస్తేనే భరోసా ఉంటుంది. మా లక్ష్యం సత్తుపల్లి ఆదర్శవంతమైన పట్టణంగా తిర్చిదిద్దుదాం. సీతరామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి రైతులకు నీరు అందించేలా చూస్తాం. ప్రత్యర్దులు బెట్టింగ్ లు ఉసి కలుపుతున్నారు. విష ప్రయోగాలు చేస్తున్నారు…ఇంత మెజారిటీ వస్తుందని అప్పుడే బుకీలను ఏర్పాటు చేసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కుట్ర రాజకీయాలకు ప్రత్యర్ధులు తెరలేపుతున్నారు. ప్రచారానికి వెళితే కావాలని కొంతమంది ని పంపి అడ్డుకుంటున్నారు..ఇలాంటి పని చెయ్యాల్సి వస్తే ఒక్కరు కూడా ప్రచారానికి వెళ్ళాలేరు.
తప్పుడు పద్దతిలో చిల్లర వ్యహరంలో రాజకీయాలు చేయ్యోద్దు. వేరే రకాల సామాజిక వర్గాలను సత్తుపల్లి తీసుకువచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని గెలిపించలేదు సైనికుడిగా పని చేశా కాబట్టే గెలిపించారు. తెలుగుదేశం పార్టీ లో చివర వరకు ఉన్న నాయకుడిన్ని నేను. తెలుగుదేశం పార్టీ లో నేను ఉంటే మంచి నీళ్ళు ఇవ్వోద్దని చెప్పినోళ్ళు ఇప్పుడు తెలుగుదేశం జపం చేస్తున్నారు. తెలుగుదేశం జెండా కట్టాని వాళ్ళు చంద్రబాబు జైల్ కి వెళితే మాట్లాడని వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల వెంట పడుతున్నారు. అధికార పార్టీ అభ్యర్ధి గా నేను ఇస్తున్న హామి లు ఇవి. సత్తుపల్లి నియోజకవర్గం లో ఒక్క మట్టి రోడ్డు లేకుండా చేసిన ఘనత నాదే. అభివృద్ది అచుతున్న సత్తుపల్లి పురోగతి సాధించాలి. బెట్టింగ్ కల్చర్ తో కుటుంబాలు నాశనం చేస్తున్నారు.