Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈరోజు తిరస్కరించింది.
Bandi Sanjay: తెలంగాణ ప్రజలను అగ్రవర్ణాల పాలన నుంచి విముక్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని... అందుకే బీసీ సీఎం ప్రకటన కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు వచ్చి వెళ్లారని.. ఐఐఎం మెడికల్ కాలేజ్‌లు ఉన్నత విద్యా సంస్థలు విభజన హామీలు ఏవీ అమలు చేయని పార్టీ బీజేపీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న విజయారెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని కొన్ని సర్వే ఏజెన్సీలు చెబుతున్నాయని.. అది నిజం కాబోతుంది అంటున్నారు విజయారెడ్డి అనుచరులు..
కాంగ్రెస్- బీఆర్ఎస్ రెండు ఒక్కటే.. నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి అని ప్రమోద్ పాండురంగ సావంత్ అన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి పని చేశాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సి ఉంది.
ముషీరాబాద్ కు చెందిన నగేష్ ముదిరాజ్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2018లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు, యువకులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు.
రైతు బాగుంటే రాజ్యం బాగుంటది అని రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ అని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఒక కేసీఆర్ ది.. రైతు పండించిన పంట అంత కేసీఆర్ ప్రభుత్వమే కొనుగోలు చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు.
Revanth Reddy: దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు నేను సవాల్ విసిరా! కానీ.. అభివృద్ధి చేయలేదు కాబట్టే నేను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.