Ponguleti: సత్తుపల్లి నా స్వంత నియోజకవర్గమని.. సత్తుపల్లిలో ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగరాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్లయు చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి భేటీ అయ్యారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని అన్నారు. టిక్కెట్ ప్రకటించక ముందు వేరు టిక్కెట్ ప్రకటించిన తరువాత వేరన్నారు సత్తుపల్లి నా స్వంత నియోజకవర్గమన్నారు. సత్తుపల్లి లో ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందురు కలిసి కట్టుగా పనిచేసి మట్టా రాగమయి ని గెలిపించాలని కోరారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా నేను తుమ్మల కలిసి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లిలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు కు అందరు కృషి చేయ్యాలని కోరారు.
పదేళ్లలో రూ.లక్ష కోట్లు దోచుకుని మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని, ఆయనను ఓడించేందుకు కేసీఆర్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, దీని కింద స్థానిక ఎమ్మెల్యేకు రూ.200 కోట్లు పంపించారన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పొంగులేటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. BRS ద్వారా పంపిణీ చేయబడిన డబ్బు మీదే అన్నారు. మీ నుండి దోచుకున్న డబ్బులో కొంత మీకు తిరిగి ఇస్తున్నారని తెలిపారు. వాటిని తీసుకెళ్లి మీ మనసులో ఉన్న హస్తముద్ర ప్రకారం ఓటు వేయండి అని పొంగులేటి అన్నారు. పదవులు ఉన్నా, లేని వారి మధ్య ఉన్న శీనన్న కావాలా.. లేక పదవులు ఉన్నా ఏమీ చేయలేని వారి మధ్య ఉన్న శీనన్న కావాలో తేల్చుకోవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కొందరు నాయకులు తిరుమలాయపాలెం మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నారని, అయితే తిరుమలాయపాలెం మాత్రమే కాకుండా పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు నడుచుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు పొంగులేటి సమక్షంలో జనసేన పార్టీ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త సురభి సూరజ్ కిరణ్ జనసేన కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.
Election Commission: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్.. ప్రకటనలు నిలిపివేసిన ఈసీ