Asaduddin Owaisi: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని పెళ్లి పెద్దగా, ఖాజీగా అభివర్ణించింది. ఈ పోస్టర్‌పై అసదుద్దీన్ స్పందించారు. బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అందరికి పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? ’’ అంటూ ప్రశ్నించారు.
పాలేరులో బలమైన నాయకుడు పొంగులేటి వచ్చారు ఇవ్వలేం అన్నారు.. ఏ సీటు ఇస్తారో చెప్పండి అంటే సమాధానం ఇవ్వలేదు.. వైరా, మిర్యాలగూడకి అంగీకారం కుదిరింది.. తర్వాత వైరా లేదు మిర్యాలగూడ ఒక్కటే ఇస్తామన్నారు.. కురదు అని చెప్పామని తమ్మినేని వీరభద్రం అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియకు ముగింపు పలికారు. ఇక, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన తుది జాబితాలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతుందని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అభివృద్ధి కోసం రమేష్ రెడ్డి కష్టపడి పనిచేశారన్నారు. రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సముచిత స్థానం ఇవ్వాలని కోరానని తెలిపారు. రమేష్ రెడ్డితో వివాదం లేకుండా ఇద్దరం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోదాడకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు.. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డీకే శివకుమార్ కోదాడ, హుజుర్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత…