Bhatti Vikramarka: నవంబర్ 30 తర్వాత బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సొమ్మును దోపిడీ చేసిన బీఆర్‌ఎస్‌ను పారద్రోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని భట్టి అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ కు ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కోరుకుంటున్న ఆరు హామీలను అమలు చేస్తామని తెలిపారు. అలాంటి హామీలపై సంతకం చేసే ధైర్యం ఉందా? కేసీఆర్‌ను ప్రశ్నించారు. పాలకుడిగా మధిర ఓటర్లను ప్రశ్నించే వారిగా పెంచారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పాటైనా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 30 తరవాత బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు రాష్ట్ర సంపదను దోచుకున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు వదిలించు కోవాలనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకరావాలని ప్రజలు సునామిలా ప్రభంజనం సృష్టించబోతున్నారని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ హయాంలో నియోజకవర్గంలో నిధులు వరదలా పారించామన్నారు. జాలిముడి ప్రాజెక్టును నిర్మిచామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక నిన్న ఎర్రుపాలెం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రాన్ని పందుల మాదిరిగా దోచుకున్నారని ఆరోపించారు. విద్య, వైద్యం, రేషన్ కార్డు లేదని, పేదలకు సొంతింటి కల కూడా రావడం లేదని ప్రజలు గమనించాలన్నారు. రానున్న 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే మధిర అసెంబ్లీ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు దోమందుల సామేలు వారికి మద్దతు తెలిపారు. భట్టి సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.