Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని సొంత పార్టీ నేతలకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో మన పార్టీ వారు ఎవరు కోవర్ట్ లుగా పని చేశారో ప్రేమ్ సింగ్ రాథోడ్ నాకు చెప్పారని అన్నారు. ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఇక్కడి నుండి అక్కడకు సమాచారం ఇస్తే అక్కడ వారు ఇక్కడకి సమాచారం ఇస్తారు మరిచిపోకండి అంటూ హెచ్చరించారు. ఈ ఎన్నిక నాకు జీవన్మరణ సమస్య అని రాజాసింగ్ తెలిపారు. చావడానికి భయపడను చంపడానికి భయపడను అని రాజాసింగ్ సొంత పార్టీనేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సొంత వాళ్లే తన వ్యూహాలను ప్రత్యర్థులకు అప్పగిస్తున్నారని రాజ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల అనంతరం మోసగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 2018లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ప్రత్యర్థులతో ఎవరు టచ్‌లో ఉంటారో తనకు బాగా తెలుసని పేర్కొన్నాడు. తనకు ఎరవైనా నమ్మకద్రోహం చేయాలనుకుంటే ఆలోచించుకోండి అంటూ సీరియస్ అయ్యారు. నమ్మక ద్రోహం చేస్తే వారికి ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటా అన్నారు. ఇక రాజాసింగ్ గతంలో గోషామహల్‌సెగ్మెంట్ లో రిగ్గింగ్ జరిగిందని, ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Bandi Sanjay: పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు