హనుమకొండ జిల్లా హరితహోటల్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియ శ్రీహరి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాసయిందని, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయబోతోందన్నారు కడియం శ్రీహరి. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు లో అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పదవులు వస్తాయి, పోతాయి, అంతేకాని శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా…
మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో మల్లేష్ ఆనే బీఆర్ఎస్ కార్యకర్తది రాజకీయ హత్య కాకపోతే.. జూపల్లి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు సరైన రీతిలో విచారణ చేయడం లేదన్నారు హర్షవర్ధన్ రెడ్డి. మల్లేష్ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను సచివాలయంలో పక్కన కూర్చో పెట్టుకుని…
KTR Twitter: సిరిసిల్ల గార్మెంట్ పరిశ్రమ సంక్షోభంపై వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొన్ని పేపర్ కటింగ్స్ పోస్ట్ చేస్తూ..
మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు మల్లు రవి. అంతేకాకుండా.. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న…
సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు వద్ద దండు మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పాటు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్…
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్ లో ఉండదని అన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ…
Harish Rao: ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం జీడిపల్లిలో
తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు అసలు సినిమా ఉంటది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ లో మొదటిసారిగా సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేసింది. అయినప్పటికీ సీఎం, మంత్రులు ఆ విమర్శలకు కౌంటర్…
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ రక్తం చిందించలేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించి జైల్లో శిక్షలు అనుభవించారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో పెట్టే వారమని ఘాటు వ్యాఖ్యలు…