ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడం మా బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ పై ఇచ్చిన హామీలపై బడ్జెట్ ఎంత అనే దానిపై సమీక్ష చేస్తున్నామన్నారు. రేపు, ఎల్లుండి సెక్రటరీలతో సమావేశం అవుతాం.. బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఇచ్చిన హామీల అమలుకు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా చర్చ చేస్తాము అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Dubbing Movies: ‘అయలాన్’ సరే… మరి కెప్టెన్ మిల్లర్ ఎక్కడ?
ఇక, కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాద్ లో చిన్న ప్లాట్ కూడా లేకుండే. ఇప్పుడు ఏ ఫామ్ హౌస్ చూసినా కేటీఆర్ దే అంటున్నారు.. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చాం.. అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మేము పుట్టిన 24 రోజులకే హామీలు ఏమైంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. దళితుల మూడెకరాల భూములు, మైనార్టీ రిజర్వేషన్ ఏమైంది కేటీఆర్ అని ఆయన ప్రశ్నించారు. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీదనే పడుతుంది.. మేడిగడ్డ ప్రాజెక్టుపై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఎవరి డైరెక్షన్ లో చేశారు అనేది తేల్చాలి.. కేటీఆర్ ఫోన్ లో ఆదేశాలు ఇవ్వగానే 100 కోట్ల రూపాయలు ఇచ్చాడంట.. అది ఎట్లా సాధ్యం అయిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అడిగారు.
Read Also: Mamata Banerjee: లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయలేదు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. తప్పుడు లెక్కలు చెప్పే ప్రభుత్వం కాదు మాది.. బడ్జెట్ పరిస్థితి చెప్పి.. అందుకు అనుగుణంగా అమలు చేస్తామన్నారు. మైనార్టీ శాఖ సీఎం దగ్గరే ఉంది.. నేరుగా ఆయనే చూస్తున్నారు.. పదవులు ఎక్కువ తక్కువ అనేది ఉండదు.. నాకు ఈ అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.. 85 శాతం జనాభా ఉన్న ప్రజలకు సబందించిన బాధ్యత ఇచ్చారని షబ్బీర్ అలీ తెలిపారు.