Medak MP Seat: సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయి అని ఆరోపించారు. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబడుతుంది అని అన్నారు. అయితే, మాజీ మంత్రి హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. హరీష్ రావు అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.. వాళ్ళతో కాసేపటి క్రితం బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారు అని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు.
Read Also: Siren : థియేటర్లలోనే విడుదల అవుతున్న కీర్తి సురేష్ సైరన్ మూవీ..
ఇక, సీట్లు అమ్ముకోవడం, డబ్బు దండుకోవడమనే ఆలోచనతో బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. అయితే, బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నా.. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పని ఖతం చేసేందుకు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి, బీఆర్ఎస్ను కాల్చే అవసరం తమకు లేదంటూ కేటీఆర్‌కు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.