Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే..అని బండి సంజయ్ అన్నారు. ఎంపీ నిధుల నుండి కరీంనగర్ జైలులో అంబులెన్స్ ,ల్యాబ్ అందించారు. కరీంనగర్ కి బండి సంజయ్ ఏం చేశాడు అని వినోద్ ,పొన్నం నన్ను అడుగుతున్నారని మండిపడ్డారు. నేను ఏం చేశానో వినోద్ రావు వరంగల్ వెళ్ళేప్పుడు , పొన్నం హుస్నాబాద్ లో తిరిగేప్పుడు చూడాలన్నారు. కరీంనగర్ లో ROB ,లేదా రైల్వే స్టేషన్ ని చూస్తే నేనేం చేశానో తెలుస్తదన్నారు. టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే అన్నారు. స్మార్ట్ సిటీకి నిధులు ఎవరిచ్చారో లెక్కలు చూస్తే తెలుస్తదన్నారు. అద్వానీకి భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. క్విట్ ఇండియా ,ఎమర్జెన్సీ.,అయోధ్య పోరాటం లో పాల్గొన్న అద్వానీకి భారత రత్న ఇవ్వడం సంతోషమని తెలిపారు. బిఆర్ఎస్ ఎంపీ ఎన్నికల కోసం చేసిన సర్వే రిపోర్ట్ నా దగ్గరికి వచ్చిందన్నారు.
Read also: Part Time Jobs Fraud: ఉద్యోగాల పేరుతో మోసాలు.. అదుపులో నలుగురు గుజరాతీలు
సర్వేలో అంతా బీజేపీ ,మోడీ అని రావడం బిఆర్ఎస్ నాయకులు కంగారు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. టెరరిస్టులు, ఉగ్రవాదులు చెసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వారు సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇండియా కూటమి విచ్ఛినం అవుతుండటంతో ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ కూడా ఇలానే మాట్లాడిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అయోధ్య రామాలయనికి అనుకూలంగా బీజేపీ ఉందని తెలిపారు. దమ్ముంటే కాంగ్రెస్ వైఖరి ఏంటో రేవంత్ చెప్పాలన్నారు. రామాలయానికి కాంగ్రెస్ వ్యతిరేకమైతే… బయటికి వచ్చి చెప్పండని అన్నారు. బీజేపీ రామాలయం కట్టింది, అది తీసేసి బాబ్రీ మసీద్ కడతామని చెప్పే దమ్ము కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ఉందా? అన్నారు. మేము హిందువులం అని చెప్పుకోలేని కుహనా లౌకిక వాదులు బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి నోటి నుండి జై శ్రీరామ్ అనిపించింది బీజేపీ అన్నారు.
The Raja Saab: ప్రభాస్ రాజు వచ్చేది నెక్స్ట్ సంక్రాంతికే… హింట్ ఇచ్చిన మేకర్స్