భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ఓడిన స్థానాల్లో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులే అక్కడ ఉన్నాయన్నారు. ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. మనం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసామని, అయినా ఫలితం అన్నది కనపడకుండా పోయిందన్నారు నిరంజన్ రెడ్డి. మనం తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన తెలంగాణా రాష్ర్టాన్ని చాలా రంగాల్లో అగ్రగామిగా నిలిపామని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రైతు బంధు, రైతు భీమా పథకాలు మంచి గుర్తింపు తెచ్చినవని, రాష్ట్ర విభజన కు ముందు మనం పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చేసేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు నిరంజన్ రెడ్డి. మన ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం, దుష్ప్రచారం, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా లో వచ్చిన అసత్య ప్రచారం ప్రధాన కారణమని ఆయన అన్నారు.
కొంతమంది ఆటో సోదరులు ప్రగతి భవన్ వద్ద ఆటోను తగలబెట్టిన ఒక్క మీడియా కూడా ఆ వార్త ను కవర్ చెయ్యలేదన్నారు. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే రాష్ట్రాన్నే తగులబెట్టెవారని ఆయన అన్నారు. ఆనాడు ఇంద్రవెల్లి సభను అడ్డుకుని ఆదివాసీ లను పిట్టలను కాల్చినట్లు కాల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. కానీ నిన్న బోయి సభ పెడితే ఒక్క పేపర్ కానీ, ఒక్క మీడియా కానీ అనాటి కాల్పుల గురించి ప్రస్తావన చేయలేదని ఆయన మండిపడ్డారు. ఆదివాసీ లపై కాల్పులు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వం.. గద్దర్ పై కాల్పులు జరిపింది తెలుగు దేశం ప్రభుత్వమన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు అన్ని కేసీఆర్ ను ఓడించి జబ్బులు చర్చుచుకుంటున్నారని, ఈ జిల్లా లో ఒకాయన మాట్లాడుతుండు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది అంటే అది తెలుగు దేశం పార్టీ కార్యకర్తల గొప్ప తనం అని అంటున్నారని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లపై ఈ కొత్త ప్రభుత్వం సంతకాలు చేయడం సిగ్గు చేటన్నారు నిరంజన్ రెడ్డి.