Bhatti Vikramarka : అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్గొండకు ఎలా వెళ్తారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీకి రాని వ్యక్తి.. మంగళవారం నల్గొండలో అసెంబ్లీకి వెళ్తావా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపాలని కోరితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు . అసెంబ్లీకి రాని వ్యక్తి రేపు బహిరంగ సభకు వెళ్తారా అంటూ నిలదీశారు. బీఆర్‌ఎస్ ఈఎన్‌సీ మురళీధరరావు తమకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. పదవీ విరమణ చేసినా పదేళ్లపాటు బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కొనసాగించారని విమర్శించారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చాలా మంది బీఆర్ఎస్ ఏజెంట్లు ఉన్నారని… వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈఎన్సీ మురళీధరరావు చేత బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆయన ఆరోపించారు. రిటైర్ అయినప్పటికీ ఆయనను పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని విమర్శించారు.
Also Read : Krishna Vamsi: హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్.. కృష్ణవంశీ ఏమన్నాడంటే..?
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ఆంధ్రప్రదేశ్‌లో రేయింబవళ్లు పనులు జరుగుతుంటే గత ప్రభుత్వం ప్రశ్నించలేదని అడిగారు. శ్రీశైలంలో ఫ్లడ్‌లైట్లు పెట్టి మరీ పనులు చేసిందని తెలిపారు. గోదావరి జలాలు, శ్రీశైలంలో మన భూభాగాలున్నాయని వాటి కోసం ఒప్పందాలు చేసుకున్నాం అనడం అర్థరహితం అన్నారు. తెలంగాణ నీళ్ల కోసమే పుట్టిందని, వాటి కోసమే పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కనీసం ఇప్పుడైనా ఆ నీటిని సమర్ధవంతంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంటే గతంలో జరిగినవి మళ్లీ గుర్తు చేసుకుని రాష్ట్రానికి అన్యాయం చేయకూడదని కోరారు.
Also Read : Hanu-Man Hindi: హిందీ 50 కోట్ల క్లబ్ లోకి హనుమాన్.. ఆరవ సౌత్ ఇండియన్ హీరోగా తేజ రికార్డు
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!