Telangana: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి బస్సులో సీఎం బృందం బయల్దేరింది. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరకు ప్రజా ప్రతినిధుల బృందం చేరుకోనున్నారు. మేడిగడ్డ బ్రిడ్జ్, కుంగిన పిల్లర్లను ఈ బృందం పరిశీలించనుంది. సాయంత్రం 5 గంటలకు సీఈ సుధాకర్‌రెడ్డి, విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్.. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: Minister Venugopala Krishna: ఏపీలో కులగణన పూర్తి కాబోతుంది
అయితే, మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అయితే, మేడిగడ్డ సందర్శనకు శాసనసభ్యులందరూ రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మేడిగడ్డలో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. అన్ని పార్టీల సభ్యులు ప్రాజెక్టును చూపించాలని నిర్ణయించామని కాంగ్రెస్ సర్కార్ పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్మాణం, లోపాలు, అనేక అంశాలపై పూర్తి అవగాహన వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటి కాబట్టి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు దూరంగా ఉన్నాయని విమర్శించారు.