Srikanta Chari Mother: బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాక్యలు చేశారు.
RS Praveen Kumar: బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్, ఆర్ ప్రవీణ్ కుమార్ మధ్య పొత్తుపై ఇప్పటికే ఈ రెండు పార్టీల..
Gutha Sukender Reddy: సీఎం రేవంత్ బందువైనప్పటికీ.. తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కడ కలవలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామ స్వామి గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కావాలనే ఇళ్లను పూర్తి కాకుండా చేశారని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500…
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు.
Ex MLA Aroori Ramesh: వరంగల్ లో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలచివేస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్ల పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేరును ప్రకటించారు.
ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, ముఖ్యమంత్రి భాషపైన నిన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.