జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 13 సంవత్సరాలుగా రాయి మీద రాయి పేర్చినట్టుగా కార్యకర్తలు సైనికులాలగా కష్టపడి పార్టీని నిర్మించామని ఆయన తెలిపారు.
భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు.. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
రైతులను ఆదుకొనే ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది.
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 16న మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ సభ నిర్వహించే సభ స్థలిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో…
Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేదని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.
నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి వెంకట్రామ రెడ్డి (IAS Retd) అన్నారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని నన్ను డబ్బులు తరలించినట్టు కథ అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమే. ఆ సమయంలో నేను ఎమ్మెల్సీగా పరోక్ష రాజకీయంలో ఉన్న…
సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తాజాగా మీడియా పూర్వకంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాపితంగా సీపీఎం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సమీక్ష చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. ఇకపోతే ఈ సమావేశంలో 70 ఏళ్లుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోడీ కొల్లగొట్టారని.. 10 ఏళ్ళ పాలనలో బీజేపి దేశాన్ని ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూటమికి 400 స్థానాలు…