పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, అతడి కుమార్తె వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్యపై తీవ్ర విమర్శలు చేశారు. కడియం కావ్య.. ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నప్పుడు ముస్లిం సంప్రదాయాలను పాటించాలని రాజయ్య అన్నారు. ఈ మతంతోని ఆమె రిజర్వేషన్ పోతుందనే భయంతో వాల్ల పిల్లల పేర్లలో కడియం అని తోక తగిలించున్నారని విమర్శించారు. ముస్లింల సంప్రదాయం ప్రకారం తమ మతాన్ని స్వీకరించిన తరువాతనే పెళ్లి చేస్తారు.. మరి ముస్లిం మతం స్వీకరించిన కావ్యకు ఎస్సీ కులం ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు.
READ MORE: Kubera: ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా..
నీ అయ్యకు పుట్టినంత మాత్రాన నువ్వు బైండ్లదానివి అవుతావా.? మీ అయ్యనే ఎవరికి పుట్టిండో తెలవదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 60 ఏండ్లుగా దళితుల రిజర్వేషన్ ను అప్పనంగా వాడుకుంటూ మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులను అనుభవించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు. దేశమంతా ఈ చీడ పురుగు కడియం శ్రీహరి వెన్నుపోటు గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. కడియం శ్రీహరిది ఒక బ్లాక్ మెయిల్ రాజకీయమని ఆరోపించారు. అలాంటి బ్లాక్ మెయిలర్ కూతురిని పార్లమెంటు ఎన్నికల్లో ఓడగొట్టాలనే కసితో వరంగల్ ప్రజలు ఉన్నారన్నారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లింగాలఘనపురం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ బాబు హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.