బీజేపీ దొందు దొందే అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు.. ఎవరికైనా అయ్యిందా..? అని ప్రశ్నించారు. రుణమాఫీ అయ్యినోళ్లు కాంగ్రెస్ కే ఓటేయండి.. కానోళ్లు మాత్రం బీఆర్ఎస్ కే ఓటేయండి అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. మహబూబాబాద్లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఇంచార్జ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల అభిప్రాయలను తెలుసుకున్నారు. ఏఎన్ రెడ్డి కాలనీలో క్లబ్ హౌజ్ లో కార్యకర్తల సమావేశం అయ్యారు. ఇక, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని మెజార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నాల్గో విడత జరిగే ఎన్నికలకు ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు చేస్తోంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్, కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.
హన్మకొండ జిల్లాలోని మడికొండ సత్యం గార్డెన్స్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య విరుచుకపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని తెలిపారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని.. వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి అని ఆరోపించారు.
BRS KTR: బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..