B.Vinod Kumar: బండి సంజయ్ 5 ఏళ్లలో 5 రూపాయలు తీసుకురాలేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయిని పల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో బోయిని పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బీజెపీ పార్టీ ప్రచారంలో భాగంగా మత విద్వేషాల రేకేర్తించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రధానీ మోడీ మతాల పేరు పై మాట్లాడడం, చట్ట వ్యతిరేకం, రాజ్యంగా వ్యతిరేకం అన్నారు. ప్రమాణ స్వీకారలో చెబుతూము…భారత దేశం ఇది, లౌకికం అనేది రాజ్యాంగంలో రాసుకున్నామని తెలిపారు. హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతాల గురించి ఎన్నికల సమయంలో మాట్లాడవద్దు, ఇది వరకే సుప్రీం కోర్టు చెప్పింది, అనర్వత వేటుకి గురి అవుతారన్నారు.
Read also: TS Inter Results 2024: నేడే ఇంటర్ రిజల్ట్.. ఎన్టీవీ వెబ్ సైట్ లో వేగంగా ఫలితాలు
భారత దేశం గొప్ప దేశం, ఉపఖండం లో వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, భారత రాజ్యాంగం వలనే సమైక్యతగా ఉందన్నారు. అఖిరికి రాజ్యాంగం ను కూడా మార్చాలని చూస్తున్నారని తెలిపారు. మోడీ కంటే ఇందిరా గాంధీకి గొప్ప పేరు ఉండేది.. ఇండియా ఈజ్ ఇందిరా ఉండేదన్నారు. వాజ్ పై కూడా పార్లమెంట్ లో కాళీమాత అన్నారు. పేరు ప్రతిష్టలు అప్పుడప్పుడు పెద్దగా ఉంటాయి.అప్పుడప్పుడు పేరు తొలగి పోతుంటాయన్నారు. బండి సంజయ్ సేంటి మెంట్ వాడుకొని గెలువాలి అని చూస్తున్నారని అన్నారు. బండి సంజయ్ 5 ఏళ్లలో 5 రూపాయలు తేలేదన్నారు. ఇది వరకే సంజయ్ గెలిపించి ప్రజలు నష్టపోయారన్నారు. నేను ఎంపీగా ఉన్న సమయంలో చాలా నిధులు తెచ్చానన్నారు. వేములవాడ, సిరిసిల్ల లో రైల్వే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వేసవి సెలవులు..