సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.
హన్మకొండ జిల్లాలోని మడికొండ సత్యం గార్డెన్స్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య విరుచుకపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని తెలిపారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని.. వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి అని ఆరోపించారు.
BRS KTR: బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 13 సంవత్సరాలుగా రాయి మీద రాయి పేర్చినట్టుగా కార్యకర్తలు సైనికులాలగా కష్టపడి పార్టీని నిర్మించామని ఆయన తెలిపారు.
భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు.. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
రైతులను ఆదుకొనే ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది.