Uttam Kumar Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గా్ల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ కోల్పోతాయన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ దిశా, దశను మార్చబోతున్నాయని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థను కూడా బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తుందని ఆరోపించారు.
READ MORE: Ranjith Reddy: చేవెళ్ళ ప్రజలకు సంక్షేమం చేయడమే నా లక్ష్యం..
మోడీ మళ్ళీ ప్రధాని అయితే.. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీ కి లేదన్నారు. ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలుస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో ఆదర్శ పాలన అందిస్తున్నామన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.