మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద వారు కాదనే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి చాటారని వారు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్న కవిత, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురు పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం మరి కాసేపట్లో అధికారికంగా నోట్ విడుదల చేయనుంది. కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడమే ఈ వేటుకు కారణమైంది. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన కవితపై ప్రస్తుతం గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్,…
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్…
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్నదన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే, ఎవరు నమ్మరు అని విమర్శించారు. ఏ రాజకీయం…
త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.…
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.
ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కవిత పీఆర్వోను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించినట్లు సమాచారం.
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్…