బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది.. ఎన్నికల ముందు విష ప్రచారం చేసింది.. ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరం పై కక్ష కట్టింది.. కాళేశ్వరం పై కక్ష కట్టి సిబిఐ విచారణ కు ఆదేశించారు.. వారం తిరగక ముందే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు.. తల దగ్గర…
మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్షత చూపిస్తుందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా భాద్యత కేంద్రానిదే.. ఉద్దేశ పూర్వకముగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పట్టించుకోట్లేదు.. మీకు చేతనైతే కేంద్రం మెడలు వంచి ఎరువులు తెండి.. రైతులు ఉద్యమించే వరకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.. Also Read:Horrific Incident in Visakha: విశాఖలో…
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారిందని ఆయన ఆరోపించారు.
కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభ బీజేపీకి కనువిప్పు కలిగించేలా, రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పేలా నిలుస్తుందని బీజేపీ నేత మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరుపై ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగానే బయటపెట్టింది కవిత. అంతేకాదు సంతోష్ రావు కూడా కుట్రలు పన్నుతున్నాడని తెలిపింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేత…
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదని... కవితని పార్టీ లోకి తీసుకోమని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ టాక్స్ అన్న వారి తలలో మెదడు లేదు పెండ(గోబర్) ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే.. ఆ రెండు పార్టీ లు…
ప్రస్తుతం కవిత సస్పెన్షనే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్ను ఆమె డిఫెన్స్ లో పడేస్తోంది. అలాగని కవితను తక్కువగా అంచనా వేయడానికి ఆస్కారం లేదు. మొదట్నుంచీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్‌తో కలిసి ఉన్న కవిత.. చెప్పే మాటలు, చేసే ఆరోపణలు కచ్చితంగా జనం నమ్మే అవకాశం ఉంది. ఈ విషయమే బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది.